Monday 11th May 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > విజయ్ ప్రమాణం తర్వాత త్రిష ట్వీట్..  ఆ ‘క్యాప్షన్’ వెనుక అర్థమేంటి?

విజయ్ ప్రమాణం తర్వాత త్రిష ట్వీట్..  ఆ ‘క్యాప్షన్’ వెనుక అర్థమేంటి?

trisha at vijay oath taking ceremony

Trisha at Vijay oath ceremony | తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ‘దళపతి’ విజయ్ ప్రమాణ స్వీకార వేడుకలో నటి త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆదివారం చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన ఈ చారిత్రాత్మక ఘట్టానికి ఆమె హాజరై తన మద్దతును చాటుకున్నారు.

స్టేడియంలో విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్‌ను త్రిష ఆత్మీయంగా హత్తుకున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అయితే, వేడుక అనంతరం ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు, దానికి పెట్టిన క్యాప్షన్ ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి.

ఈ వేడుక కోసం త్రిష నీలం రంగు చీర, మల్లెపూలతో నిండిన జడతో అచ్చమైన తమిళ అమ్మాయిలా మెరిసిపోయారు. అయితే ప్రమాణ స్వీకార వేడుక ఫోటోలను షేర్ చేస్తూ త్రిష.. ‘ప్రేమ ఎప్పుడూ గొప్పగానే కనిపిస్తుంది’ అనే క్యాప్షన్ ఇచ్చారు.

విజయ్ సాధించిన ఈ భారీ విజయాన్ని ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేశారని కొందరు అంటుంటే, వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధంపై వస్తున్న పుకార్లకు ఇది ఒక పరోక్ష సమాధానమని మరికొందరు విశ్లేషిస్తున్నారు.

మదర్స్ డే రోజే తన కుమారుడు ముఖ్యమంత్రి కావడంతో శోభా గారు ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. ఆ సమయంలో త్రిష ఆమె పక్కనే ఉండి ఓదార్చడం గమనార్హం.

కుటుంబ సభ్యుల గైర్హాజరు..
విజయ్ భార్య సంగీత మరియు పిల్లలు ఈ వేడుకకు దూరంగా ఉండటం, అదే సమయంలో త్రిష ముందు వరుసలో కనిపించడం చర్చలకు మరింత ఆజ్యం పోసింది. సూపర్ హిట్ జోడీ

విజయ్-త్రిష జోడీకి వెండితెరపై ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. ‘గిల్లి’ నుంచి ‘లియో’ వరకు వీరిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇప్పుడు రాజకీయ ప్రస్థానంలోనూ విజయ్‌కు త్రిష తోడుగా నిలవడం విశేషం.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions