Friday 1st May 2026
12:07:03 PM
Home > తాజా > జోరు పెంచిన బాలయ్య

జోరు పెంచిన బాలయ్య

Nandamuri Balakrishna News | నట సింహం నందమూరి బాలకృష్ణ ఓ వైపు రాజకీయాలు మరోవైపు సినిమా షూటింగ్ లతో బిజీ బిజీగా ఉన్నారు.

ఇదే సమయంలో ఆయన సినిమా షూటింగ్ లో వేగం పెంచారు. ఒకేసారి రెండు సినిమాల్లో నటించనున్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ ‘అఖండ-2: తాండవం’ లో నటిస్తున్న విషయం తెల్సిందే. ఇది అతి త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకోనుంది.

ఈ సినిమా అనంతరం బాలయ్య గోపిచంద్ మలినేని, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో నటించనున్నారు. ఈ రెండు సినిమాలు ఏక కాలంలో చిత్రీకరణ జరుపుకొనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు ప్రాజెక్టులు నవంబర్ నెలలో సెట్స్ పైకి వెళ్లనున్నాయి.

గోపిచంద్ మలినేని తో యాక్షన్ బ్యాక్డ్రాప్ లో బాలయ్య నటించనున్నారు. ఇకపోతే క్రిష్ మూవీ మాత్రం ‘ఆదిత్య 369’ కొనసాగింపుగా రాబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇకపై ఏడాదికి నాలుగు సినిమాలు చేస్తానంటూ ఇటీవలే బాలయ్య ప్రకటించారు.

అందుకు తగ్గట్లుగానే ఆయన ముందుకు వెళ్తున్నారు. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ కథానాయకుడిగా తెరకెక్కబోయే ‘జైలర్-2’ లోనూ బాలకృష్ణ అతిథి పాత్రలో కనువిందు చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

You may also like
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!
kalvakuntla kavitha
‘ఎస్సీల రిజర్వేషన్లు 18 శాతానికి పెంచాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions