Actor Darshan In Jail | అభిమాని హత్య కేసులో ప్రముఖ కన్నడ నటుడు దర్శన్ ( Darshan ) ప్రస్తుతం జైల్లో ఉన్న విషయం తెల్సిందే.
బెంగళూరు ( Bengaluru )లోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు ( Parappana Agrahara Central Prison )లో ఆయన విచారణ ఖైదీగా ఉన్నారు. జైల్లో ఆయనకు రాచమర్యాదలు లభిస్తున్నట్లు తెలుస్తోంది.
దీనికి సంబంధించిన ఓ ఫోటో ( Photo ) మరియు వీడియో ( Video ) బయటకు రావడంతో జైలు అధికారులు తలలుపట్టుకుంటున్నారు.
జైలు బ్యారక్ నుండి బయటకు వచ్చిన దర్శన్ స్నేహితులతో కలిసి కుర్చీలో కూర్చొని ఓ చేత్తో కాఫీ కప్పు పట్టుకుని, మరో చేత్తో సిగరెట్ తాగుతున్న ఫోటో బయటకు వచ్చింది. ఈ ఫోటోను అదే జైల్లో ఉన్న రౌడీషీటర్ ( Rowdysheeter )వేలు తన ఫోన్లో తీసి రహస్యంగా భార్యకు పంపినట్లు సమాచారం.
కాగా ఈ ఫోటో ఆదివారం బయటకు రావడంతో సంచలనంగా మారింది. అంతేకాకుండా దర్శన్ జైల్లో వీడియో కాల్స్ కూడా మాట్లాడినట్లు ఒక వీడియో బయటకు వచ్చింది.