Thaman shares his mid air conversation with Sachin | టీం ఇండియా క్రికెట్ లెజెండ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తో త్వరలోనే కలిసి పనిచేసే అవకాశం ఉన్నట్లు సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ పోస్ట్ చేయడం వైరల్ గా మారింది.
ఒకే ఫ్లైట్ లో ఈ ఇద్దరు కలిసి డల్లాస్ నుంచి దుబాయ్ వరకు ప్రయాణించారు. ఈ విషయాన్ని థమన్ వెల్లడించారు. ఈ మేరకు సచిన్ తో దిగిన ఫోటోను షేర్ చేశారు. సచిన్ తో కలిసి ప్రయాణించడం గొప్ప అనుభవం అని పేర్కొన్నారు థమన్. ప్రయాణ సమయంలో చాలా విషయాలు మాట్లాడుకున్నట్లు, సెలబ్రెటీ క్రికెట్ లీగ్ లో తన బ్యాటింగ్ వీడియోలను సచిన్ కు చూపించినట్లు తెలిపారు.
తన బ్యాట్ స్పీడ్ అద్భుతంగా ఉన్నట్లు సచిన్ ప్రశాంసించారని థమన్ సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం సచిన్ తో త్వరలోనే కలిసి పని చేసే అవకాశం రావొచ్చు అని ఆయన పేర్కొనడం ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఏదైనా మూవీ ప్రాజెక్టులో భాగంగా ఈ ఇద్దరు కలిసి వర్క్ చేసే అవకాశం ఉందా లేదా క్రికెట్ మ్యాచుకు సంబంధించిన విషయమా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.









