Monday 2nd November 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > CJIపై దాడికి యత్నం..విష్ణు విగ్రహం పై వ్యాఖ్యలే కారణమా?

CJIపై దాడికి యత్నం..విష్ణు విగ్రహం పై వ్యాఖ్యలే కారణమా?

Lawyer attempts to attack CJI BR Gavai with a shoe in courtroom | భారత ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్. గవాయ్‌పై సోమవారం సుప్రీం కోర్టులో ఒక న్యాయవాది దాడి చేయడానికి ప్రయత్నించాడు. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్ న్యాయవాదుల కేసుల వాదనలను వింటున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఓ న్యాయవాది డయాస్ దగ్గరకు వెళ్లి, తన షూ తీసి న్యాయమూర్తిపై విసరడానికి ప్రయత్నించాడు. అయితే కోర్టులో ఉన్న భద్రతా సిబ్బంది సకాలంలో స్పందించి అతన్ని బయటకు తీసుకెళ్లారు. బయటకు వెళ్తూ, ఆ న్యాయవాది “సనాతన ధర్మాన్ని అవమానించడం మేము సహించము” అని బిగ్గరగా అరిచాడు. సీజేఐ గవాయ్ స్పందిస్తూ కోర్టులో ఉన్న న్యాయవాదులను తమ వాదనలను కొనసాగించమని కోరారు.

ఈ విషయాలతో తన దృష్టి మళ్లించలేరని ఈ ఘటనతో తాను ఎలాంటి ఆందోళన చెందలేదన్నారు. అలాగే ఇలాంటి ఘటనలు తనపై ప్రభావం చూపవన్నారు. కాగా కొన్ని రోజుల క్రితం ఓ పిటిషన్ విచారణ సందర్భంగా సీజేఐ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మధ్యప్రదేశ్ ఖజురాహోలోని 7 అడుగుల తల లేని విష్ణుమూర్తి విగ్రహం పునరుద్ధరించాలని కోరుతూ ఓ వ్యక్తి పిటీషన్ దాఖలు చేశారు.

ఈ నేపథ్యంలో పిటిషన్ ను కొట్టివేసిన సీజేఐ ‘వెళ్లి ఆ దేవుడిని స్వయంగా ఏదైనా చేయమని అడగండి. మీరు విష్ణుమూర్తి భక్తుడని చెబుతున్నారు. కాబట్టి ఇప్పుడు వెళ్లి ప్రార్థన చేయండి. ఇది ఒక పురావస్తు స్థలం, దీనికి ASI అనుమతి అవసరం’ అని వ్యాఖ్యానించారు.

You may also like
TG: ‘అర్నబ్’ తుపాను కల్లోలం: 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..!
జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ!
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions