Wednesday 16th September 2026
12:07:03 PM
Home > తాజా > ‘ట్రాప్ హౌస్’ పేరుతో మైనర్ల మత్తు పార్టీ

‘ట్రాప్ హౌస్’ పేరుతో మైనర్ల మత్తు పార్టీ

‘Trap House’ rave party busted near Hyderabad | మొయినాబాద్ లోని ఓ ఫార్మ్ హౌస్ లో మైనర్ల మత్తు పార్టీని ఎస్ఓటీ పోలీసులు భగ్నం చేశారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా పరిచయం అయిన మైనర్లు ఈ పార్టీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే ‘ట్రాప్ హౌస్ 9ఎంఎం’ పేరుతో ఇషాన్ అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్ వేదికగా అకౌంట్ క్రియేట్ చేశాడు. ఇషాన్ ఇటీవలే కెనడా నుంచి భారత్ కు వచ్చాడు.

మొయినాబాద్ లోని ఓక్స్ ఫార్మ్ హౌస్ లో పార్టీని నిర్వహిస్తున్నట్లు ప్రకటించాడు. సింగిల్ గా వస్తే రూ.1600, జంటగా వస్తే రూ.2800 అని ధర నిర్ణయించాడు. ఈ క్రమంలో 59 మందికి పైగా ఆసక్తి చూపారు. ఇందులో 22 మంది మైనర్లే కావడం గమనార్హం. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పార్టీ సమయాలు. ఈ నేపథ్యంలో మైనర్లు ఫార్మ్ హౌస్ చేరుకుని మత్తు పార్టీలో మునిగితేలారు.

దీనిపై సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు ఫార్మ్ హౌస్ పై ఆకస్మిక దాడులు చేపట్టారు. ఇందులో భాగంగా విదేశీ మద్యం, అనుమతి లేని డీజే మరియు ఇద్దరు మైనర్లు గంజాయి తీసుకున్నట్లు గుర్తించారు. పోలీస్ స్టేషన్ కు తరలించి మైనర్ల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అలాగే ఫార్మ్ హౌస్ యజమాని, డీజే, పార్టీ నిర్వాహకుడు ఇషాన్ పై కేసు నమోదు చేశారు. మరోవైపు మైనర్లకు నోటీసులు జారీ చేసి వారిని వదిలేశారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions