Chaiwala In Indigo Flight | సాధారణంగా రైళ్లలో ప్రతి 10 నిమిషాలకు చాయ్ వాలా వచ్చి టీ ( Tea ) కావాలా అని ప్రయాణికులను అడుగుతాడు.
కానీ ఓ చాయ్ వాలా మాత్రం ఏకంగా విమానంలోనే తోటి ప్రయణికులకు టీ విందు ఇచ్చాడు. ఇండిగో విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ గా మారింది.
టీ పోస్తున్న సమయంలో ప్రయాణికులు డబ్బుకు ఇవ్వబోతే తనకు డబ్బులు ఏమీ వద్దని ఉచితంగానే టీ ఇస్తున్నట్లు సదరు చాయ్ వాలా పేర్కొన్నాడు. అంతేకాకుండా ‘చాయ్..చాయ్’ అంటూ విమానంలో అతడు అంటుండడం తోటివారిని ఆకర్షించింది.
36 వేల అడుగులు ఎత్తులో విమానం ఉండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కానీ, ఫ్లైట్ టేక్ ఆఫ్ సమయంలోనే ఇది జరిగిందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. వైరల్ గా మారిన వీడియోపై నెట్టింట్లో తెగ డిబేట్ నడుస్తుంది.