Smuggler Caught During Pushpa-2 Screening | అతడో కరుడుగట్టిన నేరస్థుడు. స్మగ్లింగ్ ( Smuggler ) చేస్తూ రూ. కోట్లను సంపాదించాడు. కానీ అతినికీ ఓ వీక్నెస్ ( Weakness ) ఉంది.
సదరు గ్యాంగ్ స్టర్ ( Gangster ) కు పుష్ప సినిమా అంటే పిచ్చి. పుష్ప-2 ( Pushpa-2 ) చూడడానికి ఎలాగైనా ఈ గ్యాంగ్ స్టర్ వస్తాడని ముందుగానే ఊహించిన ఖాకీలు ఎట్టకేలకు అతన్ని పట్టుకున్నారు.
ఈ ఘటన మహారాష్ట్ర నాగపూర్ ( Nagpur ) లో జరిగింది. డ్రగ్స్ స్మగ్లర్ విశాల్ ( Vishal Meshram ) మేశ్రామ్ పై రెండు హత్యలు, డ్రగ్స్ అక్రమ రవాణా, హింసాత్మక ఘటనలు ఇలా 27 కేసులు ఉన్నాయి. గత పది నెలలుగా అతడు పోలీసుల నుండి తప్పించుకుని తిరుగుతున్నాడు.
అయితే పుష్ప-2 ఎలాగైనా చూడాలని భావించిన అతడు ఓ మల్టిప్లెక్స్ ( Multiplex ) కు వెళ్ళాడు. సినిమా క్లైమాక్స్ ( Climax ) కు చేరుకుంది. ఇంతలోనే థియేటర్ లోకి వచ్చిన పోలీసులు గ్యాంగ్ స్టర్ ను పట్టుకున్నారు.
గురువారం అర్ధరాత్రి అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పుష్ప క్లిమాక్స్ లో నిమగ్నమైన నేరుగాడు పోలీసుల రాకను కూడా గమనించలేకపోయాడు. థియేటర్ లోకి పోలీసులు రావడం, గ్యాంగ్ స్టర్ అరెస్ట్ అవడం చూసిన ప్రేక్షకులు అవాక్కయ్యారు. ఒకే టికెట్ పై రెండు సినిమాలు చూసి ఉంటారు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.