Sunday 20th April 2025
12:07:03 PM
Home > తాజా > ఇది అమేజాన్ అడవి కాదు.. మా ములుగు: మంత్రి సీతక్క!

ఇది అమేజాన్ అడవి కాదు.. మా ములుగు: మంత్రి సీతక్క!

blackberry island

 – పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా:

ప్రారంభానికి సిద్ధంగా మొండ్యల తొగు బ్లాక్ బెర్రీ

– పర్యాటకులను ఆకర్షించేల బ్లాక్ బెర్రీ దివి

– బ్లాక్ బెర్రీ ట్రయల్ రన్

ములుగు జిల్లా తాడ్వాయి మండలములోని మొండ్యాల తొగు సమీపం లో పర్యాటకులను ఆకర్షించేలా బ్లాక్ బెర్రీ దీవిని సిద్ధం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ సందర్భంగా సోమవారం రాత్రి రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి  సీతక్క మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ తో కలిసి బ్లాక్ బెర్రీ దీవిని ట్రయల్ రన్ చేశారు.

వారితో పాటు భద్రాచలం నియోజక వర్గం శాసన సభ్యులు తెల్లం వెంకట్రావు,  జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, ఐటిడిఏ పిఓ చిత్రా మిశ్రా, డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, గ్రంథాలయ చైర్మన్ బానోత్  రవిచందర్ లతో కూడా ఉన్నారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఇది ఆఫ్రికా అడవి కాదు అమెరికా అసలే కాదు అమెజన్ అడవి అంతకన్నా కాదు ఇది మా ములుగు జిల్లా లోని తాడ్వాయి మండలం లోని మొండ్యాల తోగు బ్లాక్ బెర్రీ దివి అని వ్యాఖ్యానించారు.

పర్యాటకులను ఆకర్షించే విధంగా ములుగు జిల్లా లో అనేకమైన టూరిజం ను అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పారు. ఇప్పటికే ములుగు జిల్లా లో లక్నవరం, రామప్ప, బొగత

జలపాతం,లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం, ఆదివాసులు జాతర మేడారం లాంటి అనేక ప్రాంతాలు ఉన్నాయని ప్రకృతిని ఆస్వాదిస్తూ పర్యాటకులకు ఆహ్లాదం కలిగించే విధంగా ములుగు జిల్లా టూరిజం హబ్ గా ఉండటం తమకు గర్వకారణమని తెలిపారు.

తాము కూడా ఇలాంటి స్సాట్లను గుర్తించి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పం జిల్లా కలెక్టర్ , డిఎఫ్ఓ ఇతర శాఖల అధికారులు పని చేస్తున్నారని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ ఈ జిల్లా ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసే బాధ్యత మన అందరిపైనా ఉందని మంత్రి సీతక్క అన్నారు.   ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు కాంగ్రెస్ పార్టీ జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

You may also like
‘పెళ్లికూరుతు స్థానంలో ఆమె తల్లి..షాకయిన వరుడు’
‘పిఠాపురంలో దళితులపై గ్రామ బహిష్కరణ’
‘మీ ఆప్యాయతతో నా మనసు ఉప్పొంగింది’
‘ముద్దిస్తావ అన్నాడు..ఎదురైన ఘటనను చెప్పిన నటి మాళవికా’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions