Mahesh Bhatt recalls feeding investor ‘human flesh’ | బాలీవుడ్ నిర్మాత, నటి ఆలియా భట్ తండ్రి మహేష్ భట్ నర మాంసంపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారానికి దారి తీశాయి. తన సినిమాకు పెట్టుబడి కోసం తాంత్రికుడి సలహా మేరకు ఓ జమీందారుకు నర మాంసం తినిపించినట్లు ఆయన చెప్పారు.
కుమార్తె పూజ భట్ నిర్వహించిన ఓ పోడ్ కాస్ట్ లో మహేష్ భట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెరీర్ ప్రారంభంలో తాను ఎన్నో ఇబ్బందులు పడినట్లు, సినిమా తీసేందుకు ఇన్వెస్టర్ కోసం తీవ్రంగా శ్రమించినట్లు పేర్కొన్నాడు. ఇదే సమయంలో యూపీ వారణాసి లోని తన మిత్రుడితో కలిసి ఒక తాంత్రికుడి వద్దకు వెళితే ఆ తర్వాత జరిగిన షాకింగ్ ఘటనను మహేష్ భట్ పంచుకున్నాడు.
‘నేను నా స్నేహితుడు కలిసి వారణాసి లోని ఓ తాంత్రికుడి వద్దకు వెళ్ళాం. మా సమస్యను వివరించాం. సినిమాలో పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్ దొరకడం లేదని చెప్పాం. దింతో ఆ తాంత్రికుడి అల్మారా నుంచి ఒక ప్యాకెట్ తీసి ఇచ్చాడు. ఇది ఘాట్ ల వద్ద ఖననం చేసే శవాల నుంచి తీసిన మాంసం. దీనిని పెట్టుబడి దారుడికి తినిపిస్తే కచ్చితంగా ఇన్వెస్ట్ చేస్తాడు అని ఆ తాంత్రికుడి చెప్పాడు. ఆ నర మాంసాన్ని తీసుకుని మేము బీహార్ గయాలోని ఓ జమీందారును కలిసాం. పెట్టుబడి పెట్టాలని కోరాం. ఆ తర్వాత కిల్లీలో నర మాంసాన్ని కలిపి అతడికి ఇచ్చాము. అది ఆ జమీందారు తిన్నాడు. కానీ మా ప్లాన్ సక్సెస్ కాలేదు. ఆ జమీందారు పెట్టుబడి పెట్టలేదు’ అని మహేష్ భట్ తెలిపాడు. కాగా పెట్టుబడి కోసం నర మాంసాన్ని తినిపించడం ఏంటని నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.









