Boat Accident During Actor Suhas Cinema Shoot | నటుడు సుహాస్ ‘మండాడి’ సినిమాతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చెన్నై సముద్రతీరంలో జరుగుతుంది. అయితే తాజాగా షూటింగ్ సమయంలో ఘోర ప్రమాదం జరిగింది.
సముద్రంలో షూటింగ్ చేస్తున్న సమయంలో ఒక పడవ బోల్తా పడింది. ప్రమాద సమయంలో పడవపై ఇద్దరు సిబ్బంది, కెమెరాలు ఉన్నాయి. నీట మునిగిన ఇద్దర్ని సినిమా యూనిట్ రక్షించింది. అయితే అత్యంత ఖరీదైన కెమెరాలు, ఇతర సామగ్రి మాత్రం సముద్రంలో మునిగిపోయాయి.
సుమారు రూ.కోటి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. తమిళ దర్శకుడు మతిమారన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నటుడు సూరి హీరోగా నటిస్తున్నారు. ఇందులో సుహాస్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది.









