Sunday 27th September 2026
12:07:03 PM
Home > తాజా > అరడజను పిల్లలతో..ప్రభాస్ బావ అంటూ మోహన్ బాబు పోస్ట్’

అరడజను పిల్లలతో..ప్రభాస్ బావ అంటూ మోహన్ బాబు పోస్ట్’

Prabhas Birthday | ప్రభాస్ త్వరగా పెళ్లి చేసుకుని అరడజను పిల్లలతో సంతోషకరమైన జీవితాన్ని గడపాలని మోహన్ బాబు చేసిన పోస్ట్ తెగ వైరల్ గా మారింది. రెబల్ స్టార్ ప్రభాస్ గురువారం తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అభిమానులు, సినీ ప్రముఖులు ప్రభాస్ కు సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇందులో భాగంగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ప్రభాస్ ను బావ అని ఆప్యాయంగా పిలిచిన మోహన్ బాబు త్వరగా పెళ్లి చేసుకుని, అరడజను మంది పిల్లలతో సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. ‘నా ప్రియమైన డార్లింగ్ బావ ప్రభాస్, నీవు దేశానికే గర్వకారణం. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో ఘనంగా జరుపుకోవాలి, వంద సంవత్సరాలు ఆరోగ్యంగా, సంతోషంగా జీవించాలి. త్వరలో వివాహం చేసుకొని, అరడజను పిల్లలతో సంతోషమైన జీవితాన్ని గడపాలి. హృదయపూర్వక ప్రేమతో, ఎల్లప్పుడూ నిన్ను ప్రేమించే నీ బావ’ అంటూ మోహన్ బాబు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

You may also like
సీఎం రేవంత్ రెడ్డికి నాని విజ్ఞప్తి.. స్పందించిన ముఖ్యమంత్రి!
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions