Rashmika Mandanna And Vijay Deverakonda Engaged | నటుడు విజయ్ దేవరకొండ నటి రష్మిక మందన్న అతి త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. గత కొన్ని నెలలుగా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారంపై విజయ్, రష్మిక ఇప్పటివరకు స్పందించలేదు. కానీ వీరిద్దరు సోషల్ మీడియా పోస్టుల ద్వారా రిలేషన్షిప్ లో ఉన్నారని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.
తాజగా శుక్రవారం హైదరాబాద్ లోని విజయ్ నివాసంలో ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో విజయ్-రష్మిక నిశ్చితార్థం జరిగింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే విజయ్, రష్మిక తొలుత గీతా గోవిందం సినిమాలో కలిసి నటించారు. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ లోనూ కలిసి అలరించారు. ప్రస్తుతం రాహుల్ సంకృత్యాయన్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు.









