Monday 4th May 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > విజయ్ సునామీపై కవిత కీలక వ్యాఖ్యలు!

విజయ్ సునామీపై కవిత కీలక వ్యాఖ్యలు!

‌- దేశానికి తమిళ ప్రజలు సరికొత్త సంకేతం ఇచ్చారంటూ ప్రశంసలు!

Kavitha Comments On Vijay Victory | తమిళనాడు శాసనసభ ఎన్నికల కౌంటింగ్‌లో సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీ సరికొత్త చరిత్ర సృష్టించే దిశగా దూసుకుపోతోంది.

దశాబ్దాల చరిత్ర ఉన్న దిగ్గజ ద్రావిడ పార్టీలను ఎదిరించి.. విజయ్ సాధిస్తున్న ఈ అద్భుతమైన ఆధిక్యంపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కవిత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

తమిళ ప్రజల సరికొత్త తీర్పు..
టీవీకే పార్టీ ప్రభంజనంపై స్పందిస్తూ.. తమిళ ప్రజలు దేశానికి ఒక బలమైన సంకేతాన్ని పంపారని కవిత పేర్కొన్నారు.

“ఉన్న వాళ్లతో విసిగిపోయాం, అధికార దాహార్తులతో వేసారిపోయాం.. భ్రష్టుపట్టిపోయిన ఈ రాజకీయ చరిత్రను తిరగరాయడానికి ‘కొత్త రాజకీయ శక్తులు’ అవసరమని దేశానికి తమిళ ప్రజలు ఒక సంకేతం పంపారు” అంటూ ఆమె సామాజిక మాధ్యమాల వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు.

నూతనంగా పార్టీ స్థాపించిన అతి తక్కువ కాలంలోనే ప్రజల్లో సరికొత్త నమ్మకాన్ని కలిగించడంలో విజయ్ సఫలీకృతులయ్యారని, ఈ ఫలితాలే దానికి నిదర్శనమని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

తమిళనాడులో చోటుచేసుకున్న ఈ అనూహ్య రాజకీయ మార్పులపై దేశవ్యాప్తంగా వివిధ పార్టీల నేతలు స్పందిస్తున్న క్రమంలో కవిత చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్‌గా మారాయి.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions