Monday 4th May 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > విజయ్ సునామీ దెబ్బ.. కావ్య మారన్ కుటుంబానికి భారీ షాక్!

విజయ్ సునామీ దెబ్బ.. కావ్య మారన్ కుటుంబానికి భారీ షాక్!

kavya maran trolled by fans for pak player

Vijay TVK win impact on stock market | తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) సంచలన విజయం దిశగా దూసుకుపోతుండడం మార్కెట్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

అందరి అంచనాలను తలకిందులు చేస్తూ దశాబ్దాల ద్రావిడ పార్టీల ఆధిపత్యానికి విజయ్ బ్రేక్ వేస్తుండడంతో, అధికార డీఎంకేకు అత్యంత సన్నిహితంగా ఉండే ప్రముఖ మీడియా సంస్థ ‘సన్ టీవీ నెట్‌వర్క్’ (Sun TV Network) మార్కెట్‌లో భారీగా నష్టపోయింది.

5.38 శాతం పతనమైన షేర్లు..
డీఎంకే ఘోర పరాజయం దిశగా వెళ్తుండటంతో సన్ టీవీ నెట్‌వర్క్ షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. సోమవారం మార్కెట్ ముగిసే సమయానికి ఈ సంస్థ షేర్లు 5.38 శాతం నష్టపోయి రూ. 573 వద్ద స్థిరపడ్డాయి.

సన్ టీవీ నెట్‌వర్క్ అధినేత కళానిధి మారన్ (సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ తండ్రి) ప్రస్తుత ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌కు అత్యంత దగ్గరి బంధువు. డీఎంకే ఓటమి పాలవుతుండటంతో ఆ ప్రభావం సంస్థ వ్యాపారాలపై పడుతుందనే ఆందోళనతో ఇన్వెస్టర్లు షేర్లను విక్రయించినట్లు మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

టీవీకే మ్యాజిక్ ఫిగర్ ఉత్కంఠ..
మరోవైపు తమిళనాడులో విజయ్ పార్టీ అత్యధిక స్థానాల్లో ముందంజలో ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన స్పష్టమైన మ్యాజిక్ ఫిగర్ (118 స్థానాలు) సాధించేందుకు మరికొన్ని స్థానాల దూరంలో ఉంది.

దీంతో అక్కడ హంగ్ ఏర్పడుతుందా లేక ఇతర పార్టీల మద్దతుతో విజయ్ సీఎం అవుతారా అన్నది ఆసక్తికరంగా మారింది. రాజకీయ మార్పుల ప్రభావం తమిళనాట వ్యాపార దిగ్గజాలపై ఎలా పడుతుందనడానికి సన్ టీవీ షేర్ల పతనం నిదర్శనంగా నిలిచింది.

You may also like
sunrisers leeds abrar ahmed controversy
సన్‌రైజర్స్ ‘పాక్’ ప్లేయర్ వివాదం.. బీసీసీఐ స్పందన ఇదీ!
kavya maran trolled by fans for pak player
సన్ రైజర్స్ లోకి పాక్ ప్లేయర్.. కావ్య మారన్ పై నెటిజన్లు ఫైర్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions