Wednesday 16th September 2026
12:07:03 PM
Home > క్రైమ్ > నకిలీ నంబర్ ప్లేట్లపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సర్జికల్ స్ట్రైక్!

నకిలీ నంబర్ ప్లేట్లపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సర్జికల్ స్ట్రైక్!

  • 5 క్రిమినల్ కేసులు నమోదు, వాహనాలు స్వాధీనం!

Hyd Traffic Police Crackdown Fake Number Plates నగరంలో నకిలీ, ట్యాంపరింగ్ చేసిన మరియు అనుమతి లేని రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లతో రోడ్లపై తిరుగుతున్న వాహనదారులపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపారు.

ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకోవడానికి, క్రిమినల్ కార్యకలాపాలకు పాల్పడేందుకు కొందరు నంబర్ ప్లేట్లతో ఆడుతుండటంపై ఫిర్యాదులు పెరగడంతో జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) డి. జోయల్ డేవిస్, ఐపీఎస్ ఆదేశాల మేరకు నగరవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.

ఈ విస్తృత తనిఖీల్లో భాగంగా గత వారంలో నకిలీ నంబర్ ప్లేట్లతో తిరుగుతున్న వాహనదారులపై 5 క్రిమినల్ కేసులు నమోదు చేసి, ఆయా వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

5 పోలీస్ స్టేషన్లలో క్రిమినల్ కేసులు..

మోటారు వాహనాల చట్టాన్ని తీవ్రంగా ఉల్లంఘించినందుకు బండ్లగూడ, ఉస్మానియా యూనివర్సిటీ, మీర్‌పేట్, వనస్థలిపురం (మల్కాజిగిరి కమిషనరేట్), అశ్వారావుపేట (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా) లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసు నమోదు చేశారు.

HSRP నంబర్ ప్లేట్లు మాత్రమే చట్టబద్ధం..

ప్రభుత్వం ఆమోదించిన హై-సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు (HSRP) మాత్రమే వాహనాలకు వాడాలని జాయింట్ సీపీ హెచ్చరించారు. సొంతంగా నంబర్ల ఆకారాన్ని మార్చడం, అంకెలు కనిపించకుండా ట్యాంపరింగ్ చేయడం లేదా స్టిక్కర్లు అతికించడం శిక్షార్హమైన నేరమని స్పష్టం చేశారు.

జీరో టాలరెన్స్ విధానం..

నంబర్ ప్లేట్ల అక్రమాలపై ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని పోలీసులు తేల్చిచెప్పారు. దొంగ నంబర్ ప్లేట్లతో దొరికితే వెంటనే క్రిమినల్ కేసులతో పాటు వాహనాన్ని సీజ్ చేస్తామని హెచ్చరించారు. నగరంలో ప్రజాభద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఈ ప్రత్యేక తనిఖీలు క్రమం తప్పకుండా నిరంతరం కొనసాగుతాయని, వాహనదారులంతా చట్టానికి లోబడి నియమాలు పాటించాలని ట్రాఫిక్ పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది.

You may also like
av rangananth
గణేశ్ నిమజ్జనాలపై ఆంక్షలు లేవు.. ‘హైడ్రా’ కమిషనర్ ఏవీ రంగనాథ్ క్లారిటీ!
HYDERABAD: గచ్ఛిబౌలి లో ఘోర ప్రమాదం!
HYDERABAD: సామాన్యుడిలా బైక్‌పై నగర సీపీ సజ్జనర్!
కేబీఆర్ పార్కు వద్ద వన్ వే ట్రాఫిక్.. వాకర్స్‌తో ట్రాఫిక్ పోలీసుల భేటీ!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions