Monday 21st September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > విద్యార్థి సాహిల్ ఆత్మహత్య.. సారీ చెప్పిన ముంబై ఐఐటీ!

విద్యార్థి సాహిల్ ఆత్మహత్య.. సారీ చెప్పిన ముంబై ఐఐటీ!

  • సీపీకి వ్యతిరేకంగా ప్రొఫెసర్ల మద్దతు!

IIT Bombay Apologises BTech Student Sahil Death ఐఐటీ బొంబాయి (IIT Bombay) క్యాంపస్‌లో బిటెక్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి సాహిల్ రవీంద్ర వాకోడే ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర ఆందోళనలకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఘటనపై యాజమాన్యం ఎట్టకేలకు దిగొచ్చింది.

విద్యార్థి మృతి చెందిన పరిస్థితులపై గతంలో తాము చేసిన ముందస్తు వ్యాఖ్యలు, ప్రకటనలపై యాజమాన్యం బహిరంగంగా క్షమాపణలు చెప్పింది. కేసు ఇంకా విచారణ దశలో ఉండగా, ముందే వివరాలను వెల్లడించడం సరికాదని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వివరణ ఇచ్చింది.

మరోవైపు, ఐఐటీ బొంబాయి డైరెక్టర్ శిరీష్ కేదార్ రాజీనామా చేశారంటూ వస్తున్న వార్తలను యాజమాన్యం ఖండించింది. డైరెక్టర్ రాజీనామా చేయలేదని, ఆ వార్తలు అబద్ధమని స్పష్టం చేసింది.

విద్యార్థుల 18 డిమాండ్లు..

విద్యార్థి ఆత్మహత్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఐఐటీ విద్యార్థులు ఆందోళన చేపట్టగా.. డైరెక్టర్ శిరీష్ కేదార్ సోమవారం విద్యార్థులతో సమావేశమై వారు సమర్పించిన 18 డిమాండ్ల పత్రంపై సంతకం చేశారు. వీటిలో రెండు డిమాండ్లను ఇప్పటికే ఆమోదించారు. సాహిల్ కుటుంబ సభ్యులు, విద్యార్థులు క్యాంపస్‌లో కుల వివక్ష, వేధింపులు ఎదురయ్యాయని ఆరోపిస్తూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ అంశంపై ముంబై క్రైమ్ బ్రాంచ్ నిష్పాక్షిక విచారణ జరుపుతోంది.

పరీక్షలో మాల్ ప్రాక్టీస్ వివాదం..

మిడ్-సెమిస్టర్ పరీక్షలో సాహిల్ స్మార్ట్‌ఫోన్ మరియు చాట్‌జీపీటీ (ChatGPT) ఉపయోగిస్తూ పట్టుబడినట్లు ఆరోపణలు రాగా, ఆ తర్వాతే ఆయన హాస్టల్ గదిలో శవమై కనిపించాడు. పరీక్షలో విద్యార్థి ఫోన్ వాడటాన్ని పట్టుకుని, నియమావళి ప్రకారం నివేదించిన ఇన్విజిలేటర్ ప్రొఫెసర్ సూర్యనారాయణ డూల్లాను ‘డీన్ ఆఫ్ స్టూడెంట్స్ వెల్ఫేర్’ పదవి నుంచి తొలగించడాన్ని ఐఐటీ ఫ్యాకల్టీ ఫోరమ్ తప్పుబట్టింది. ప్రొఫెసర్ కేవలం తన బాధ్యతలను మాత్రమే నిర్వర్తించారని ఆయనకు పూర్తి మద్దతు తెలిపింది.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions