YCP MP To Join TDP | నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు (Lavu SrikrishnaDevarayalu) టీడీపీ(TDP)లో చేరనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం పల్నాడు ప్రజలకు బహిరంగ లేఖ రాశారు.
గడిచిన 5 సంవత్సరాలలో ప్రజలు తనపై చూపిన ప్రేమ, అభిమానం ఎన్నటికీ మరవలేనిదని తెలిపారు. ప్రజల సహాయ సహకరాలతో పల్నాడు లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లు చెప్పారు.
కాగా తన రాజకీయ భవిష్యత్ పై నాయకులు, కార్యకర్తలు అడుగుతున్నారని, ఈ ప్రశ్నలకు సమాధానంగా తాను మరలా పల్నాడు ప్రాంతం నుండి పోటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు.
అలాగే త్వరలో జిల్లాలో జరగబోయే తెలుగు దేశం పార్టీ భారీ బహిరంగ సభలో చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు.
గడిచిన 5 ఏళ్లలో సవాళ్ళను సోపానాలుగా స్వీకరించి పల్నాడు అభివృద్ధికి కృషి చేసినట్లు, ఇప్పుడు మరోసారి అవకాశం ఇస్తే అభివృద్ధిని మరింత ముందుకు తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు.