Thursday 7th May 2026
12:07:03 PM
Home > తాజా > తెలంగాణ మంత్రి సీతక్కకు చేదు అనుభవం!

తెలంగాణ మంత్రి సీతక్కకు చేదు అనుభవం!

seethakka

Minister Seethakka | తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం ఇందిరా మహిళా శక్తి సంబురాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో వినూత్న కార్యక్రమాలతో మహిళా స్వయం సహాయక బృందాలు సంబురాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే మహిళా శక్తి వేడుకల్లో (Minister Seethakka) మంత్రి సీతక్కకు చేదు అనుభవం ఎదురైంది. గురువారం ములుగు జిల్లా గిరిజన భవనంలో నిర్వహించిన మహిళా శక్తి వేడుకలను మంత్రి సీతక్క పాల్గొన్నారు. కార్యక్రమంలో మహిళలు బోనాలు, బతుకమ్మలతో మంత్రి సీతక్కకు స్వాగతం పలికారు.

కూరగాయలతో పేర్చిన బతుకమ్మను మంత్రి సీతక్కకు ఇచ్చారు. ఈ క్రమంలోనే నెత్తి మీద పెట్టుకొని మంత్రి వెళుతుండగా పేర్చిన కూరగాయలు ఒక్కసారిగా కిందకు పడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.

You may also like
minister seethakka
మహిళా సంఘాలకు సర్కార్ తీపి కబురు!
seethakka pressmeet
అనాథ బిడ్డల భవిష్యత్తుకు భరోసా!
seethakka launches medaram festival coffee table book
మేడారం జాత‌ర‌పై కాఫీ టేబుల్ బుక్!
seethakka pressmeet
‘జీ రామ్ జీ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాం’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions