Monday 14th September 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ‘వైఎస్సార్ కొడుకై ఉండి’..షర్మిల సంచలనం

‘వైఎస్సార్ కొడుకై ఉండి’..షర్మిల సంచలనం

YS Sharmila vs Jagan Mohan Reddy 2026, Sharmila on Jagan tweets today, Women's Reservation Bill AP politics, Jagan supporting Delimitation Bill, వైఎస్ షర్మిల జగన్ విమర్శలు, ఏపీ రాజకీయ వార్తలు, మహిళా బిల్లు జగన్ ట్వీట్.

Ys Sharmila News | ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల.

అందరూ వద్దంటున్న పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబుకి అంత ప్రేమెందుకో ప్రజలకు అర్థం కావట్లేదని విమర్శించారు. ఇటు రాష్ట్ర మేధావులు వ్యతిరేకిస్తున్నారని, ఆ ప్రతిపాదన పనికిరాదని సీమ ప్రొఫెసర్లు చెబుతున్నారని పేర్కొన్నారు.

బనకచర్ల లింక్ ప్రతిపాదన పోలవరం అసలు ప్రాజెక్టుకే ఎసరుపెడుతుందని పోలవరం ప్రాజెక్టు అథారిటీ చెబుతున్నా చంద్రబాబుకి ఎందుకు అర్ధం కావడం లేదని షర్మిల ప్రశ్నించారు. చంద్రబాబు సొంత ప్రయోజనాల కోసం ఏకంగా పోలవరాన్నే ముంచేద్దామని ప్లాన్ చేస్తున్నారా? అని అనుమానం వ్యక్తం చేశారు.

మరోవైపు బీజేపీ దత్తపుత్రుడు జగన్ మోహన్ రెడ్డి పోలవరం గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్లుందని షర్మిల విమర్శలు గుప్పించారు. వైఎస్సార్ కొడుకై ఉండి 5 ఏళ్లలో పోలవరంలో తట్టెడు మట్టి తీశారా ? మహానేత ఆశయ సాధకుడే అయితే పోలవరంపై ఎందుకు నిర్లక్ష్యం చేశారు ? అని జగన్ ను నిలదీశారు షర్మిల.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions