Tuesday 15th September 2026
12:07:03 PM
Home > తాజా > AA 22..నాలుగు పాత్రల్లో ఐకాన్ స్టార్ ?

AA 22..నాలుగు పాత్రల్లో ఐకాన్ స్టార్ ?

Allu Arjun To Play Four Roles In Atlee’s AA-22 | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-దర్శకుడు అట్లీ కాంబినేషన్ లో ఓ భారీ సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే.

ఈ మూవీ AA-22 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. అలాగే ఇందులో బాలీవుడ్ నటి దీపికా పదుకొనె నటించనున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం వైరల్ గా మారింది.

ఇందులో అల్లు అర్జున్ ఏకంగా నాలుగు పాత్రల్లో నటించనున్నట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అట్లీ-తళపతి విజయ్ కాంబినేషన్ లో వచ్చిన అదిరింది సినిమాలో నటుడు మూడు పాత్రల్లో కనిపించారు. అలాగే విజిల్ సినిమాలో తండ్రీ, తనయుడి పాత్రలతో అలరించారు.

ఇప్పుడు అల్లు అర్జున్ తాత, తండ్రి, ఇద్దరు కుమారులుగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ను అలరించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇదే నిజమైతే అల్లు అర్జున్ ఒకే సినిమాలో నాలుగు పాత్రల్లో సందడి చేయడం తొలిసారి అవుతుంది.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions