Monday 21st September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ఇటలీ పాఠశాలల్లో ‘బుర్ఖా, నిఖాబ్’ లపై నిషేధం!

ఇటలీ పాఠశాలల్లో ‘బుర్ఖా, నిఖాబ్’ లపై నిషేధం!

  • విదేశీ విద్యార్థుల సంఖ్యపై సీలింగ్ ప్రతిపాదించిన ప్రధాని జార్జియా మెలోనీ!

Italy To Ban Burqa Niqab In Schools ఇటలీలోని విద్యాసంస్థల్లో పాఠశాల స్థాయిలో సాంస్కృతిక అనుసంధానం, భాషా నైపుణ్యాలను మెరుగుపరిచే దిశగా ప్రధాని జార్జియా మలోని (Giorgia Meloni) నేతృత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

పాఠశాలల్లో ముఖాన్ని పూర్తిగా కప్పివేసే ‘బుర్ఖా’, ‘నిఖాబ్’ ధరించడంపై నిషేధం విధించడంతో పాటు, ప్రతి తరగతి గదిలో ఉండే విదేశీ విద్యార్థుల సంఖ్యపై చట్టపరమైన పరిమితి (Cap) విధించే ప్రతిపాదనను క్యాబినెట్ ముందుకు తీసుకురానున్నట్లు ఆమె ప్రకటించారు. తన సొంత పార్టీ ‘బ్రదర్స్ ఆఫ్ ఇటలీ’ (Brothers of Italy) కి చెందిన యూత్ వింగ్ వార్షిక సమావేశంలో మాట్లాడుతూ ప్రధాని ఈ సంచలన ప్రకటన చేశారు.

తరగతికి విదేశీ విద్యార్థుల సీలింగ్..

ఒకే తరగతి గదిలో ఇటాలియన్ భాష రాని విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే, అది విలీనం (Integration) కిందకు రాదని, వారిని నిర్లక్ష్యం చేయడమే అవుతుందని మలోని పేర్కొన్నారు. అందుకే ప్రతి తరగతిలో విదేశీ విద్యార్థుల సంఖ్యకు గరిష్ట పరిమితి నిర్ణయిస్తామని చెప్పారు. విద్యా వ్యవస్థలో కలిసిపోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్న విదేశీ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఇటాలియన్ భాషను తప్పనిసరిగా నేర్చుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

ముఖం మూసే వస్త్రాలపై నిషేధం..

“పాఠశాలకు వెళ్లే ప్రతి ఒక్కరూ ముఖం కనిపించేలా వెళ్లాలి. ఇటలీలో ఏ ఆచారం పేరిట కూడా ఒక యువతి తన ముఖాన్ని దాచుకోవాలని ఎవరూ నిర్ణయించలేరు” అని మలోని తేల్చిచెప్పారు. ఈ నిషేధం కేవలం ముఖం కప్పే బుర్ఖా, నిఖాబ్‌లకు మాత్రమే వర్తిస్తుందని, తలను మాత్రమే కప్పే ‘హిజాబ్’కు కాదని స్పష్టమైంది. ఫౌండేషన్ ISMU గణాంకాల ప్రకారం ఇటలీ పాఠశాలల్లో ఇటాలియన్ పౌరసత్వం లేని విద్యార్థులు ప్రస్తుతం 11.6 శాతంగా ఉన్నారు.

You may also like
రైల్వే స్టేషన్‌లో కరపత్రాలు పంచిన జపాన్ మాజీ ప్రధాని!
ఇటలీ ప్రధాని మెలోని సరికొత్త రికార్డు.. ప్రధాని మోదీ అభినందనలు!
దేశ ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ!
student visa
ట్రంప్ మరో షాక్.. ఆ వీసా హోల్డర్ల వర్క్ పర్మిట్ల రద్దుకు ప్రతిపాదన!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions