PM Modi Congratulates Giorgia Meloni ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి భారత ప్రధాని నరేంద్ర మోదీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
రెండవ ప్రపంచ యుద్ధానంతర ఇటలీ చరిత్రలో అత్యంత సుదీర్ఘకాలం పాటు నిరంతరంగా ప్రధానిగా పనిచేసిన నేతగా ఆమె అరుదైన రికార్డు సాధించారు. ఈ విజయం ఆమె నాయకత్వంపై ఇటలీ ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమని మోదీ పేర్కొన్నారు.
బలపడుతున్న భారత్-ఇటలీ సంబంధాలు..
మోదీ – మెలోని మధ్య ఉన్న మైత్రి భారత్-ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసింది. రక్షణ రంగం, వ్యవసాయం మరియు డిజిటల్ కనెక్టివిటీ మౌలిక వసతులలో ఇరుదేశాల భాగస్వామ్యం విస్తరిస్తోంది. ‘భారత్-మిడిల్ ఈస్ట్-యూరప్ ఆర్థిక కారిడార్’ (IMEEC) ప్రాజెక్టులో భాగస్వామ్యానికి ఇటలీ ఆసక్తి చూపింది.
భారత్ మరియు యూరోపియన్ యూనియన్ (EU) మధ్య ఉచిత వాణిజ్య ఒప్పందంలో ఇటలీ కీలక పాత్ర పోషిస్తోంది. ఇరుదేశాల శ్రేయస్సు కోసం మెలోనితో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నట్లు మోదీ వెల్లడించారు.











