Cryovault India CEO | స్టెమ్ సెల్ ప్రిజర్వేషన్‌లో (శిశువు బొడ్డు తాడు సంరక్షణ) ప్రఖ్యాతిగాంచిన క్రయోవాల్ట్ బయోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (Cryovault Biotech India) కొత్త సీఈవోగా, కేబీకే గ్రూప్ చైర్మన్ డాక్టర్ కక్కిరేణి భరత్ కుమార్ (Dr. Bharat Kumar Kakkireni) ఎంపికయ్యారు.
శుక్రవారం హైదరాబాద్ లోని క్రయోవాల్ట్ ఇండియా ప్రధాన కార్యాలయంలో కంపెనీ ప్రతినిధుల సమక్షంలో భరత్ కుమార్ బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రయోవాల్ట్ సీఈవో (Cryovault CEO) గా బాధ్యతలు స్వీకరించడం చాలా ఆనందంగా ఉందన్నారు.
భారత్ లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఆరోగ్య సంరక్షణ నిమిత్తం స్టెమ్ సెల్ బ్యాంకులు జీవాధారాలు గా మారుతున్నాయని తెలిపారు. భవిష్యత్తులో ఎదురయ్యే అత్యవసర పరిస్థితులు, వైద్య సవాళ్లను ఎదుర్కునేందుకు స్టెమ్ సెల్ బ్యాంకులు దోహదపడతాయని భరత్ కుమార్ పేర్కొన్నారు.
ముందు తరాలకు మంచి ఆరోగ్యాన్ని అందించేందుకు స్టెమ్ సెల్ ప్రిజర్వేషన్ చాలా ఆవశ్యకమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ స్టెమ్ సెల్ బ్యాంకింగ్ పై దేశవ్యాప్తంగా ప్రజల్లో మరింత అవగాహన పెంపొందించాల్సిన బాధ్యత ఉందన్నారు డాక్టర్ భరత్ కుమార్.
క్రయోవాల్ట్ ఇండియా సీఈవోగా తనపై ఒక గురుతర బాధ్యత మోపారని తెలిపారు. మనదేశంతోపాటు స్టెమ్ సెల్ బ్యాంకింగ్ లో క్రయోవాల్ట్ సేవలను ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.
ఇటీవల హెచ్ఎంటీవీ హెల్త్ కేర్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2023లో క్రయోవాల్ట్ ఇండియా తెలంగాణ ఆరోగ్య మంత్రి టి. హరీష్ రావు చేతులమీదుగా “భారతదేశంలో ఉత్తమ స్టెమ్ సెల్ బ్యాంక్ 2023” అవార్డును కూడా అందుకుంది.
క్రయోవాల్ట్ బయోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మరియు దాని స్టెమ్ సెల్ ప్రిజర్వేషన్ సేవల గురించి మరింత సమాచారం కోసం www.cryovault.inని సందర్శించండి.
కేబీకే గ్రూప్ లో మరో మైలురాయి..
ఐటీ, డిజిటల్ మార్కెటింగ్ నుంచి హాస్పిటల్, మీడియా వరకు వివిధ రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న కేబీకే గ్రూప్ మరో మైలు రాయి చేరింది. ఈ సంస్థ తాజాగా స్టెమ్ సెల్ బ్యాంకింగ్ రంగంలోకి ప్రవేశించింది.
కేబీకే క్రయోవాల్ట్ ద్వారా స్టెమ్ సెల్ బ్యాంకింగ్ సేవలను విస్తరిస్తోంది కేబీకే గ్రూప్. కేబీకే బిజినెస్ సొల్యూషన్స్, కేబీకే మల్టీ-స్పెషాలిటీ హాస్పిటల్, ఈక్వినాక్స్ IT సొల్యూషన్స్ ఎల్ఎల్సీ, KBK గ్లోబల్టెక్, కేబీకే ప్రాపర్టీ డెవలపర్స్, కేబీకే ఫార్మా మరియు కేబీకే బ్రాడ్‌కాస్టింగ్ రంగాల్లో డాక్టర్ భరత్ కుమార్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి విజయవంతంగా సారథ్యం వహిస్తున్నారు..