Chiranjeevi Praises Getup Srinu | జబర్దస్త్ (Jabardast Comedian) కమెడియన్ గెటప్ శ్రీను (Getup Srinu) ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘రాజు యాదవ్’ (Raju Yadav). క్రిష్ణమాచారి (Krishnama Chary) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీను సరసన అంకితా కారత్ (Ankitha Kharat) నటిస్తున్నారు.
ఈ సినిమా మే 24న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెబుతూ ఓ వీడియో విడుదల చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సందర్భంగా గెటప్ శ్రీనుపై ప్రశంసలు కురిపించారు.
ఈ జనరేషన్ కమెడియన్లలో తనకి బాగా నచ్చిన నటుడు గెటప్ శ్రీను అంటూ కితాబిచ్చారు. గెటప్ శ్రీనును చూస్తుంటే అప్పట్లో ఉన్న కామెడీ హీరో చలం (Chalam) గుర్తుకు వస్తారని చిరంజీవి చెప్పారు. రాజు యాదవ్ చిత్రం మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.