Mega Hero Unfollows Allu Arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)ను మరియు ఆయన సతీమణి అల్లు స్నేహరెడ్డిని మెగా హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) సోషల్ మీడియా ఖాతాల్లో అన్ ఫాలో చేయడం తీవ్ర చర్చకు దారి తీస్తుంది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచార నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా మద్దతు ప్రకటించారు. మరోవైపు నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డి తరఫున ఆయన ఇంటికి వెళ్లి ప్రచారం చేశారు.
ఈ పరిణామం అనంతరం నుండి మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ ల మధ్య ఏం జరుగుతుంది అనే కొత్త చర్చ మొదలైంది. అంతేకాకుండా ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం మెగాస్టార్ చిరంజీవి ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్లిన సమయంలో, మరియు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అల్లు కుటుంబం నుండి ఎవరు హాజరు కాలేదు.
ఈ క్రమంలో సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ను, అల్లు స్నేహ రెడ్డిని సాయిధరమ్ తేజ్ అన్ ఫాలో అవ్వడం చర్చనీయాంశంగా మారింది. కానీ అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ ను మాత్రం సాయిధరమ్ ఫాలో అవుతున్నారు.