Monday 17th March 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > దారి వెంట పరదాలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!

దారి వెంట పరదాలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!

cbn press meet

CM Chandra Babu | ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు (CM Chandrababu) దారి వెంట పరదాలకు సంబంధించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు, అనంతరం కుటుంబ సమేతంగా తిరుమలకు వెళ్లారు. ఈ క్రమంలో తిరుమలలో చంద్రబాబు వెళ్లే దారి వెంట అధికారులు పరదాలు కట్టారు.

ఈ క్రమంలో స్పందించిన సీఎం, తాను వెళ్లే దారి వెంట ఎటువంటి పరదాలు కట్టవద్దని, వెంటనే తొలగించాలని అదేశించారు. తనను ప్రజలకు దూరం చేసే ఎటువంటి చర్యలు చేపట్టొద్దని సీఎం చంద్రబాబు పోలీసులకు తెలిపారు.

ఈ నేపథ్యంలో సీఎం ఆదేశాలు మేరకు కట్టిన పరదాలను అధికారులు తొలగించారు. ఇదిలా ఉండగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియా తో మాట్లాడిన సీఎం, తిరుమలపై ఓం నమో వెంకటేశాయ తప్ప వేరే నినాదం ఉండొద్దని, గత ఐదేళ్లలో తిరుమలను అధ్వాన్నంగా మార్చారని విమర్శించారు.

You may also like
‘యూట్యూబర్ హర్షసాయి నీకు బుద్ధి ఉందా’
‘ఏయ్ పోలీస్! పాటకు డాన్స్ చెయ్ లేదంటే సస్పెండ్’
‘హిందీ వివాదం..పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన’
హిందీ గో బ్యాక్..పవన్ గత వ్యాఖ్యల్ని గుర్తుచేసిన స్టాలిన్ సోదరి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions