Saturday 1st August 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > లారెన్స్ దాతృత్వం.. హాట్సాఫ్ చెబుతున్న నెటిజన్లు!

లారెన్స్ దాతృత్వం.. హాట్సాఫ్ చెబుతున్న నెటిజన్లు!

Raghava Lawrence

Raghava Lawrence Donation | డాన్స్ తో పాటు పేదలకు దాన గుణంలో ఎప్పుడూ ముందుండే ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.

తరచూ అనాథలు, పేదలకు నిస్వార్థంగా సేవ చేస్తూ మంచి మనసు చాటుకున్న లారెన్స్ తాజాగా వికలాంగుల కోసం గొప్ప సాయం అందించారు.

వికలాంగులకు బైకులు పంపిణి చేసి వారికి అండగా నిలిచారు. గతంలో ఒకసారి కలిసినప్పుడు సరైన గూడు లేక ఇబ్బందులు పడుతున్న ఆ వికలాంగులకు ఇల్లు కట్టిస్తాను అని లారెన్స్ గతంలో మాట ఇచ్చారు. ఆ మాటకు కట్టుబడి ఇటీవలే వారికీ కొత్త ఇంటిని ఇచ్చారు.

తాజాగా వారికి బైక్స్ కూడా డొనేట్ చేసి వారిని మరింత సంతోష పరిచారు. మొత్తం 13 మందికి 13 బైక్స్ ని లారెన్స్ వారికీ అందించి సర్‌ప్రైజ్ చేశారు. ఆ బైక్స్ చూసి ఆ వికలాంగులు సంతోషంతో కన్నీరు పెట్టుకున్నారు.

దీనికి సంబంధించిన వీడియోని లారెన్స్ తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేయగా అది వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ చూసిన నెటిజెన్స్ లారెన్స్ ని అభినందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. లారెన్స్ గొప్ప మనసుకు హాట్సాఫ్ చెబుతున్నారు.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
modi civic satyagraha call
బీ అలెర్ట్.. ప్రధాని మోదీ ‘సివిక్ సత్యాగ్రహం’ పిలుపు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions