Tuesday 29th July 2025
12:07:03 PM
Home > తాజా > కేబీకే వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనాథలకు అన్నదానం!

కేబీకే వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనాథలకు అన్నదానం!

KBK Welfare Association | యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణ పరిధిలోని అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం లో కేబీకే వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం మహా అన్నదాన కార్యక్రమం జరిగింది.
అమెరికాలో నివాసం ఉంటున్న సాహిత్ సారిక దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆశ్రమంలోని 600 మందికి ఈ అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు సాహిత్ సారిక దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మతిస్థిమితం లేని అనాథలకు సహాయం చేసిన ఆ దంపతులకు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా కేబీకే వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తరచూ ఇలాంటి సేవ కార్యక్రమాలు చేపడుతున్న కేబీకే గ్రూప్ ఫౌండర్ కక్కిరేణి భరత్ కుమార్ మరియు ఆయన సతీమణి జయ వైష్ణవిలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కేబీకే వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు రాజేందర్ రెడ్డి, సందీప్ రెడ్డి, అరుణ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

You may also like
కేబీకే గ్రూప్ ఆధ్వర్యంలో తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం
kbk group
కేబీకే గ్రూప్ ఖాతాలో మరో అవార్డు!
Kakkireni Bharath Kumar
KBK Group Chairman భరత్ కుమార్ కక్కిరేణికి విజనరీ లీడర్ అవార్డ్!
Kakkireni Bharath Kumar
KBK Group అధినేత భరత్ కుమార్ కు మరో అరుదైన ఘనత!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions