Monday 9th December 2024
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > తొలి విడత పోలింగ్.. పెళ్లి బట్టల్లో వచ్చి ఓటేసిన వధువు!

తొలి విడత పోలింగ్.. పెళ్లి బట్టల్లో వచ్చి ఓటేసిన వధువు!

Bride cast vote

Bride Cast Vote | సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా శుక్రవారం తొలి దశ ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. సుమారు 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుండే పోలింగ్ మొదలయ్యింది. ఉత్తర్ ప్రదేశ్ లోని ముజఫర్ నగర్ పార్లమెంట్ స్థానానికి కూడా తొలి విడుతలోనే ఎన్నికలు జరుగుతున్నాయి.

ఈ సందర్భంగా పెళ్లి బట్టల్లోనే ఓటు వేయడానికి వచ్చింది ఓ నవ వధువు. స్థానికంగా నివాసం ఉండే దీప అనే యువతి వివాహం శుక్రవారం రోజు జరగనుంది. వివాహ ముహూర్తాని కంటే ముందు పెళ్లి దుస్తువులతో పోలింగ్ బూత్ కు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు ఆమె.

దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. దీంతో ఎంత ముఖ్యమైన కార్యం ఉన్నా ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

You may also like
akshay kumar votes
దేశ ఎన్నికల్లో తొలిసారి ఓటేసిన హీరో అక్షయ్ కుమార్!
rahul gandhi
పెళ్లిపై రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు!
divorce over kurkure
KURKURE కొనివ్వలేదని భర్తకు విడాకులు ఇచ్చిన భార్య!
balayya babu
నామినేషన్ వేసిన బాలకృష్ణ.. ఆస్తులు, అప్పులు ఎంతంటే?

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions