Monday 17th March 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > KURKURE కొనివ్వలేదని భర్తకు విడాకులు ఇచ్చిన భార్య!

KURKURE కొనివ్వలేదని భర్తకు విడాకులు ఇచ్చిన భార్య!

divorce over kurkure

Divorce Over Kurkure | ఇటీవల కాలంలో కారణాలు ఏవైనాగానీ విడాకులు (Divorce) తీసుకునే జంటల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అయితే విడాకుల కోసం కొంతమంది వింత కారణాలు చెప్పడం ఆసక్తిగా మారింది. తాజాగా ఆగ్రా లోనూ ఓ జంట విడాకులకు ఓ వింత కారణం చోటుచేసుకుంది.

ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh)లోని ఆగ్రా (Agra)లో నివసించే ఓ జంటకు ఏడాది క్రితం వివాహం అయ్యింది. అయితే భార్యకు స్నాక్స్ అంటే ప్రాణం.

మరీ ముఖ్యంగా కుర్కురే స్నాక్స్ అంటే అమితమైన ఇష్టం. ప్రతిరోజు భర్త కుర్కురే (Kurkure) చిప్స్ తీసుకువచ్చి భార్యకు ఇచ్చేవాడు. కానీ ఒక రోజు భర్త కుర్కురే తీసుకురావడం మర్చిపోయారు.

Read Also: APలో ఆల్ టైం రికార్డ్ పోలింగ్.. ఎంత శాతమంటే!

దీంతో అసహనానికి లోనయిన భార్య, భర్తపై అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత భర్త నుండి విడాకులు కావాలని పోలీసులను ఆశ్రయించింది ఆ సదరు మహిళ. దీంతో దంపతులకు కౌన్సిలింగ్ ఇప్పించాలని పోలీసులు భావించారు.

తన భర్త తనను వేధిస్తున్నాడని భార్య ఆరోపించగా, భార్యకు జంక్ ఫుడ్ అధికంగా తినే అలవాటు ఉందని భర్త వాపోయాడు. కాగా ఈ దంపతులు విడాకులు తీసుకోవడానికి చెబుతున్న కారణాలు వైరల్ గా మారాయి.

You may also like
power cut
హెల్మెట్ లేకపోతే నో పెట్రోల్.. బంక్ సిబ్బందికి షాక్ ఇచ్చిన లైన్ మన్!
prayag raj kumbhamela
మహా కుంభమేళతో రూ. 2 లక్షల కోట్ల వ్యాపారం!
UP Marriage
పెళ్లి భోజనంలో రోటీలు ఆలస్యం.. ఏకంగా వధువునే మార్చేసిన వరుడు!
Bride cast vote
తొలి విడత పోలింగ్.. పెళ్లి బట్టల్లో వచ్చి ఓటేసిన వధువు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions