RC16 Title | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం శంకర్ (Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్ గా నటిస్తోంది.
గేమ్ ఛేంజర్ తర్వాత రామ్ చరణ్, ఉప్పెన ఫేం డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ప్రస్తుతం ఆర్సీ 16 (RC16) అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం రూపొందనుంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Jahnvi Kapoor) నటిస్తున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ కూడా వచ్చింది.
కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ (Siva Rajkumar) కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ (AR Rahman) మ్యూజిక్ అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను భారీగా నిర్మిస్తున్నాయి.
తాజాగా ఆర్సీ16కి సంబంధించి ఓ బిగ్ అప్డేట్ ఫిలిం సర్కిళ్లలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా అతి త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నటలు తెలుస్తోంది. ఈ మార్చి 20న పూజా కార్యక్రమంతో ఆర్సీ16 షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా ఈ చిత్రానికి ‘పెద్ది’ (Peddi) అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఇదే టైటిల్‌ను బుచ్చిబాబు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) సినిమా కోసం రిజిస్టర్ చేశారని, దాన్నే ఇప్పుడు రామ్ చరణ్ సినిమాకు పెడుతున్నట్లు రూమర్లు వెలువడుతున్నాయి. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.