Wednesday 23rd July 2025
12:07:03 PM
Home > తాజా > మాస్ లుక్ లో ఆనంద్ దేవరకొండ.. కొత్త సినిమా పోస్టర్ రిలీజ్!

మాస్ లుక్ లో ఆనంద్ దేవరకొండ.. కొత్త సినిమా పోస్టర్ రిలీజ్!

Anand Deverakonda New Poster | బేబీ (Baby) సినిమాతో హిట్ అందుకున్న యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) ప్రస్తుతం గం.. గం.. గణేశా (Gam Gam Ganesha) సినిమాతో ముందుకు వస్తున్నారు. ఇప్పటి వరకు సాఫ్ట్ లవ్ స్టోరీస్ చేసిన ఆనంద్ దేవరకొండ తన కెరీర్ లో తొలిసారి యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు.

ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ (HyLife Entertainment) పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

ఇదిలా ఉండగా, శుక్రవారం ఆనంద్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ గం..గం.. గణేశా మూవీ యూనిట్ ఒక కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది.

భుజం మీద గన్ పెట్టుకొని కారు మీద కూర్చున్న ఆనంద్.. ఆయుధాలతో మీదకు వస్తున్న విలన్లను చూసి నవ్వుతున్న పోస్టర్ లో మాస్ లుక్ లో కనిపిస్తున్నారు.

వారితోపాటు రోజ్ ఫ్లవర్ ఇస్తున్న హీరోయిన్ చేయిని కూడా చూపించారు. షూటింగ్ ఇప్పటికే పూర్తయిన ఈ సినిమాను అతి త్వరలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

You may also like
rajagopal raju
టాలీవుడ్ నటుడు రవితేజ కుటుంబంలో తీవ్ర విషాదం!
senior actress b saroja devi passes away
సీనియర్ నటి సరోజా దేవి కన్నుమూత!
కోట శ్రీనివాసరావు ఇకలేరు
AA 22..నాలుగు పాత్రల్లో ఐకాన్ స్టార్ ?

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions