Sunday 13th September 2026
12:07:03 PM
Home > తాజా > మల్లెపూలు తెచ్చిన తంట..హీరోయిన్ కి రూ.లక్ష జరిమానా

మల్లెపూలు తెచ్చిన తంట..హీరోయిన్ కి రూ.లక్ష జరిమానా

Actress Navya Nair Fined Over Rs.1 lakh at Melbourne Airport For Carrying Jasmine | మలయాళ నటి నవ్య నాయర్ కు ఊహించని ఘటన ఎదురైంది. ఓనం పండుగ సంబరాల్లో పాల్గొనేందుకు ఆమె ఇటీవలే ఆస్ట్రేలియా వెళ్లారు.

ఈ క్రమంలో మెల్బోర్న్ విమానాశ్రయంలో మల్లెపూలు తీసుకు వచ్చినందుకు ఆమెకు అక్కడి అధికారులు ఏకంగా రూ.లక్ష జరిమానా విధించారు. ఆస్ట్రేలియా వెళ్తున్న క్రమంలో నవ్య నాయర్ తన బ్యాగులో మల్లెపూలను తీసుకెళ్లారు.

అయితే మెల్బోర్న్ విమానాశ్రయంలో అత్యంత కఠినమైన బయోసెక్యూరిటీ చట్టాలు ఉన్నాయి. ప్రయాణికులు పండ్లు, పూలు, విత్తనాలు తీసుకెళ్లడం ఇక్కడ నిషేధం. వీటి మూలంగా ఇతర ప్రయాణికులకు వ్యాధులు, తెగుళ్లు వ్యాపించే అవకాశం ఉందని అధికారులు కఠినమైన చట్టాలు అమలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో నవ్య నాయర్ బ్యాగులో మల్లెపూలు గుర్తించిన కస్టమ్స్ సిబ్బంది అధికారులకు సమాచారం ఇచ్చారు. అనంతరం మల్లెపూలు తీసుకువచ్చినందుకు నటికి రూ.1.14 లక్షల జరిమానా విధించారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions