Lokesh Satires On Jagan | అక్రమాస్తుల కేసులో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan) కి బెయిల్ రద్దు చేయాలని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఆ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం కేసులో ప్రతివాదులుగా ఉన్న ఏపీ సీఎం జగన్, సీబీఐ (CBI)కి నోటీసులు జారీ చేసింది.
కాగా, ఈ నోటిసులను ప్రస్తావిస్తూ టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh).. సీఎం జగన్ పై సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు.
“దోచిన దొంగ సొమ్ముతో వ్యవస్థల్ని ఇంకెంతకాలం మేనేజ్ చేస్తావ్ ఏ1 జగన్. చట్టం, న్యాయం తన పని తాను చేయడం మొదలు పెట్టింది.
నీ దొంగల ముఠా పని అయిపోయింది. 6093 ఖైదీ డ్రెస్ ఉతికించి పెట్టుకో!” అని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు లోకేశ్.