No Non Veg Day In UP | ఉత్తర్ ప్రదేశ్ లోని యోగి అదిత్యనాథ్ (Yogi Adityanath) ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే హలాల్ సర్టిఫైడ్ (Halal Certified Food) ఆహారాన్ని పూర్తిగా నిషేధించిన యోగి ప్రభుత్వం సాధు తన్వర్ దాస్ లీలరామ్ వాస్వాని (Sadhu Tanwar Das) జయంతిని పురస్కరించుకొని సంచలన నిర్ణయం తీసుకుంది.
సాధు లీలారామ్ వాస్వాని (Leelaram Vasvani) ఒక విద్యావేత్త, విద్యారంగంలో ‘మీరా ఉద్యమాన్ని‘ ప్రారంభించి విశేష ఆదరణ పొందారు.
కాగా ఆయన జయంతి అయిన నవంబర్ 25 న అంతర్జాతీయ మాంసరహిత దినోత్సవం (No Nonveg Day) గా ఇప్పటికే గుర్తించారు. ఎందుకంటే శాఖహారా జీవనాన్ని బలంగా సమర్దించారు సాధు వాస్వాని.
ఈ నేపథ్యంలో నవంబర్ 25 న ఉత్తర్ ప్రదేశ్ లో కూడా నో నాన్ వెజ్ డే ను ప్రకటించింది యూపీ ప్రభుత్వం (UP Government). ఆ రోజు మాంసం షాపులతో పాటు, కబేళాలను మూసివేయాలని ఆదేశించింది యోగి సర్కార్.