Wednesday 16th September 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > “అలాంటి రౌడీలను ఎందుకు కాపాడుతున్నారు” పవన్ కళ్యాణ్ కు వైసీపీ కౌంటర్.!

“అలాంటి రౌడీలను ఎందుకు కాపాడుతున్నారు” పవన్ కళ్యాణ్ కు వైసీపీ కౌంటర్.!

ysrcp vs pawan

YCP Counter To Pawan | వైజాగ్ హార్బర్ అగ్నిప్రమాద ఘటన పై జనసేన మరియు వైసీపీ ల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. శుక్రవారం వైజాగ్ హార్బర్ బాధితులతో సమావేశం అయిన జనసేనని పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసారు.

విశాఖ హార్బర్లో దండుపాళ్యం గ్యాంగులు.. చీకటి మూకలు రెచ్చిపోతున్నాయని, 80 శాతం నష్టపరిహారం అని చెప్పి రూ.5 లక్షలు చేతులో పెట్టారంటూ ఏపీ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు పవన్ కళ్యాణ్.

ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించింది వైసీపీ. “విశాఖ హార్బర్లో బోట్ల దగ్ధం ఘటన వెనుక మీ పార్టీ కార్యకర్త నాని ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.

అయినా మీరు అలాంటి రౌడీలను కాపాడేందుకు తాపత్రయపడుతున్నారు. ఇదొక్కటే కాదు.

దండుపాళ్యం, చంబల్ లోయ బంధిపోట్లు తోబాటు పార్కింగులో పెట్టిన బైకు ప్లగ్గులు ఎత్తుకెళ్లి అమ్ముకునే చిల్లర గ్యాంగ్ మొత్తం జనసేన లోనే ఉన్నారు.” అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది వైసీపీ.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions