Prabhas Post | పాన్ ఇండియా స్టార్ (PanIndia Star), ఇండియన్ సినిమా బాహుబలి (Bahubali) ప్రభాస్ పెళ్లి (Prahbash Marriage) గురించి ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ప్రభాస్ పెళ్లి గురించి ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి.
వాటన్నింటినీ ఆయన ఫ్యామిలీ ఖండిస్తూ వచ్చింది. తాజాగా ప్రభాస్ చేసిన ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ మరోసారి ఆయన పెళ్లిపై రూమర్స్ క్రియేట్స్ చేస్తోంది.
‘డార్లింగ్స్.. ఫైనల్లీ ఒక స్పెషల్ పర్సన్ మన జీవితంలోకి రాబోతున్నారు. వెయిట్ చేయండి’ అంటూ ప్రభాస్ తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేశారు.
దీంతో ఇది కచ్చితంగా ప్రభాస్ పెళ్లి గురించే అయ్యుంటుదేమో అని అభిమానులతోపాటు సినీ ఇండస్ట్రీ మొత్తం చర్చించుకుంటోంది.
ఆ స్పెషల్ పర్సన్ ప్రభాస్ రియల్ డార్లింగే కావొచ్చని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ప్రభాస్ నెక్ట్స్ అప్ డేట్ కోసం ఎదురుచూస్తున్నామంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.