Thursday 7th August 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ప్రధాని మోదీకి రష్యా అత్యున్నత పురస్కారం.. అందజేసిన పుతిన్!

ప్రధాని మోదీకి రష్యా అత్యున్నత పురస్కారం.. అందజేసిన పుతిన్!

Modi Puthin

Modi Russia Tour | రష్యా దేశ అత్యున్నత పురస్కారం “ఆర్డర్ ఆఫ్ సెయింట్ అండ్రూ ది అపోస్టల్ ” ను ప్రధాని మోదీ అందుకున్నారు. రష్యా పర్యటనలో భాగంగా మంగళవారం అత్యున్నత పురస్కారాన్ని ప్రధాని మోదికి అందజేశారు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.

రాజధాని మాస్కో లోని క్రెమ్లిన్ లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. రష్యా భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టం చేసిన సేవలకు గాను ప్రధాని మోదికి 2019 లోనే ఈ పురస్కారాన్ని ప్రకటించారు.

తాజా పర్యటన సందర్భంగా పుతిన్ చేతుల మీదుగా ఈ అవార్డును ప్రధాని అందుకున్నారు. ఈ పురస్కారాన్ని అందుకున్న తొలి భారతీయుడిగా మోదీ నిలిచారు. ఇరు దేశాల మధ్య బంధాన్ని పటిష్టం చేయడంలో మోదీ కృషి ప్రశంసనీయం అని ప్రదానోత్సవ కార్యక్రమంలో పుతిన్ వ్యాఖ్యానించారు.

అవార్డును అందుకున్నందుకు అభినందనలు తెలిపారు. రష్యా అత్యున్నత పురస్కారం అందుకోవడం సంతోషంగా ఉందన్న ప్రధాని, ఈ అవార్డును140 కోట్ల భారత ప్రజలకు అంకితం ఇస్తున్నట్లు చెప్పారు.

You may also like
‘బీసీలకు 42% రిజర్వేషన్లు..తెలంగాణ తడాఖా చూపిస్తాం’
‘నేను ప్రమోట్ చేసింది బెట్టింగ్ యాప్ కాదు’
ధనుష్-మృణాల్ డేటింగ్ లో ఉన్నారా?
లార్డ్స్ మైదానంలో ‘నక్క పరుగులు’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions