Monday 14th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ కన్నుమూత

జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ కన్నుమూత

Satyapal Malik Death News | జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు.

ఈ మేరకు సత్యపాల్ మాలిక్ వ్యక్తిగత కార్యదర్శి కేఎస్ రాణ ఈ విషయాన్ని వెల్లడించారు. మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలతో ఆయన మే 11న ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి డయాలసిస్ ద్వారా ట్రీట్మెంట్ పొందారు. చికిత్స పొందుతూ మంగళవారం మరణించారు.

జమ్మూకశ్మీర్ తో పాటు బీహార్, ఒడిశా, గోవా, మేఘాలయ రాష్ట్రాల గవర్నర్ గా సత్యపాల్ మాలిక్ పనిచేశారు. మే నెలలో జమ్మూకశ్మీర్ లో ఓ పవర్ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియలో సత్యపాల్ మాలిక్ పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గతంలో సత్యపాల్ మాలిక్ ఇంట్లో సోదాలు చేసిన సీబీఐ ఆయనపై ఛార్జీషీట్ దాఖలు చేసింది.

You may also like
దేశ స్వావలంబనకు 7 సూత్రాల’సప్తధార’: ప్రధాని మోదీ!
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions