Tuesday 22nd April 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకున్న ముద్రగడ!

పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకున్న ముద్రగడ!

Mudragada Padmanabham | కాపు ఉద్యమ నేత, ప్రస్తుత వైసీపీ నాయకులు ముద్రగడ పద్మనాభం తన పేరు మార్చుకున్నారు. ఇటీవల తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటూ దరఖాస్తు చేసుకున్నారు. తాజగా ప్రభుత్వం గెజిట్ ను జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో సమయంలో ముద్రగడ వైసీపీ లో చేరారు. అనంతరం టీడీపీ కూటమి ఓడిపోతుందని, అలాగే పిఠాపురం నుండి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఓడిస్తానని ఆయన ఛాలెంజ్ చేశారు.

అలా జరగక పోతే తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని సవాల్ చేశారు. అయితే జూన్ 4న వెలువడిన ఫలితాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయాన్ని నమోదు చేసింది. అంతేకాకుండా పిఠాపురం నుండి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలిచారు.

ఈ క్రమంలో ముద్రగడ పేరు మార్చుకోవాలని పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. అయితే ట్రోల్స్ పై స్పందించిన ముద్రగడ తన పేరును మార్చుకుంటున్నట్లు ప్రకటించారు.

ఇందులో భాగంగా ఆయన చేసుకున్న దరఖాస్తు మేరకు, ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పేరును మారుస్తూ ప్రభుత్వం గెజిట్ ను జారీ చేసింది.

You may also like
‘రూ.2.5 కోట్లు మనీ లాండరింగ్..మహేష్ బాబుకు ఈడీ నోటీసులు’
‘లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారు’
‘అమెరికా పర్యటనలో ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ సంచలనం’
‘సిద్ధి వినాయక ఆలయంలో ఎలాన్ మస్క్ తల్లి ప్రత్యేక పూజలు’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions