Thursday 15th January 2026
12:07:03 PM
Home > క్రీడలు > సచిన్ అండర్సన్ సిరీస్.. ఐదో టెస్ట్ ముందు ఇంగ్లండ్ కు షాక్!

సచిన్ అండర్సన్ సిరీస్.. ఐదో టెస్ట్ ముందు ఇంగ్లండ్ కు షాక్!

ind vs eng

India England Test Series | సచిన్ – అండర్సన్ టెస్ట్ సిరీస్ లో భాగంగా భారత్ (India), ఇంగ్లాండ్ (England) జట్ల మధ్య లండన్ లోని ఓవల్ వేదికగా గురువారం నుంచి ఐదో టెస్ట్ ప్రారంభకానుంది. 5 టెస్టుల ఈ సిరీస్ లో ఇప్పటికే ఆతిథ్య ఇంగ్లాడ్ జట్టు 2-1 ఆధిక్యంలో ఉంది.

ఈ ఐదో టెస్టు సిరీస్ ఫలితాన్ని నిర్ణయించనుంది. దీంతో భారత జట్టు ఈ టెస్ట్ మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ ను సమం చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ టీం కు బిగ్ షాక్ తగిలింది. ఈ సిరీస్ అత్యధిక వికెట్లు తీసి, ఇంగ్లండ్ గెలుపులో కీలక పాత్ర వహించిన కెప్టెన్ బెన్ స్టోక్స్ ఐదో టెస్టుకు దూరమయ్యాడు.

కుడి భుజం గాయం కారణంగా ఐదో టెస్టులో స్టోక్స్ ఆడటం లేదని ఈసీబీ ప్రకటించింది. ఈ మేరకు చివరి టెస్ట్ తుది జట్టును బుధవారం ప్రకటించింది. స్టోక్స్ స్థానంలో ఇంగ్లండ్ టీం కెప్టెన్ గా మిడిలార్డర్ బ్యాట్స్ మన్ ఓలీ పోప్ బాధ్యతలు తీసుకోనున్నాడు. జట్టులోకి కొత్తగా జాకబ్ బెథెల్, గన్ అట్కిన్సన్, జామీ ఓవర్టన్ చేరారు.

You may also like
‘మరగుజ్జు’ వ్యాఖ్యలు..బుమ్రా కామెంట్స్ పై సఫారీ కెప్టెన్
kohli retirement
రెడ్ బాల్ గేమ్ కు గుడ్ బై.. కొహ్లీ ఎమోషనల్ పోస్ట్!
‘BCCI సెంట్రల్ కాంట్రాక్ట్.. వారికి రూ.7 కోట్ల వేతనం’
ipl
IPL 2025: కేంద్రం కీలక నిర్ణయం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions