Monday 14th September 2026
12:07:03 PM
Home > క్రీడలు > ప్రధాని తర్వాత అత్యంత కఠిన ఉద్యోగం అతడిదే: శశిథరూర్!

ప్రధాని తర్వాత అత్యంత కఠిన ఉద్యోగం అతడిదే: శశిథరూర్!

sashi tharoor

Sashi Tharoor Meets Gambhir | టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Couch Gautham Gambhir) పనితీరుపై క్రికెట్ ఫ్యాన్స్ నుంచి విమర్శలు వెల్లుతెత్తుతున్న వేళ, ఆయనపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ (Sashi Tharoor) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దేశంలో ప్రధానమంత్రి తరువాత అత్యంత ఒత్తిడితో కూడిన బాధ్యత గంభీర్‌దేనని శశిథరూర్ అభిప్రాయపడ్డారు. నాగ్‌పూర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌కు ముందు గంభీర్‌ను థరూర్ కలిశారు.

ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి దిగిన ఫొటోను ‘ఎక్స్’లో థరూర్ షేర్ చేశారు. “నా పాత మిత్రుడు గౌతమ్ గంభీర్‌తో నాగ్‌పూర్‌లో  కీలక చర్చ జరిగింది. ఆయన ప్రస్తుతం దేశంలో అత్యంత కఠినమైన ఉద్యోగాల్లో ఒకదాన్ని నిర్వహిస్తున్నారు” అని థరూర్ పేర్కొన్నారు.

నిత్యం లక్షలాది అభిమానుల విమర్శలు, తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నా గంభీర్ ప్రశాంతంగా, ధృడంగా ముందుకు సాగుతున్నారని థరూర్ ప్రశంసించారు. ఆయన నాయకత్వ నైపుణ్యాన్ని మెచ్చుకుంటూ రాబోయే సిరీస్‌లో టీమిండియా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

దీనికి గంభీర్ స్పందిస్తూ, “థాంక్యూ డాక్టర్ శశి థరూర్. కోచ్ అధికారాలపై ఉన్న అపోహలు కాలక్రమేణా తొలగిపోతాయి. అప్పటివరకు, నా వాళ్లే నాపై విమర్శలు చేయడం ఆశ్చర్యంగా ఉంది” అని వ్యాఖ్యానించారు

https://x.com/ShashiTharoor/status/2013947267284377700

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
modi civic satyagraha call
బీ అలెర్ట్.. ప్రధాని మోదీ ‘సివిక్ సత్యాగ్రహం’ పిలుపు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions