Sunday 2nd August 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ట్రంప్-పుతిన్ భేటీ..స్పందించిన భారత్

ట్రంప్-పుతిన్ భేటీ..స్పందించిన భారత్

India welcomes meet between Trump-Putin | ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగింపు దిశగా మరో కీలక అడుగు పడింది. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఒప్పించాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రయత్నం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆగస్ట్ 15న అమెరికాలోని అలస్కా రాష్ట్రంలో ట్రంప్-రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య భేటీ జరగనుంది. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ స్పందించింది.

అలాస్కాలో సమావేశమయ్యేందుకు అమెరికా, రష్యాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాన్ని భారత్ స్వాగతించింది. ఉక్రెయిన్ లో కొనసాగుతున్న సంఘర్షణకు ముగింపు పలికి శాంతి నెలకొనేందుకు మార్గం సుగమమం అవుతుందని, ఈ సమావేశం హామీ ఇచ్చిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

తొలుత పుతిన్-ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తో కలిసి త్రైపాక్షిక భేటీ నిర్వహించాలని ట్రంప్ భావించారు. కానీ భూభాగాల మార్పిడి విషయంలో వివాదం తలెత్తింది. భూభాగా మార్పిడిని అంగీకరించిందే లేదని జెలెన్స్కీ స్పష్టం చేశారు.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions