Friday 5th June 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > పిఠాపురం ఆడపడుచులకు పవన్ రాఖీ కానుక

పిఠాపురం ఆడపడుచులకు పవన్ రాఖీ కానుక

Deputy CM Pawan Kalyan sends sarees to widowed women as a Rakhi gifts | రాఖీ పౌర్ణమి సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలోని వితంతు ఆడపడుచులకు కానుకలు పంపారు స్థానిక ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.

పిఠాపురానికి చెందిన 1,500 మంది వితంతు మహిళలకు జనసేన నేతలు, కార్యకర్తలు చీరలు పంపిణీ చేశారు. రాఖీ పౌర్ణమి కానుక పంపినందుకు పవన్ కు ఆడపడుచులు ధన్యవాదాలు తెలిపారు.

వివిధ కారణాలతో భర్తను కోల్పోయిన వితంతువులకు సోదరుడిగా తాను ఉన్నాను అనే భరోసా కల్పించడంతో పాటు వారిలో ఆత్మస్థైర్యం నింపేలా, ప్రతి ఆడపడుచునూ గౌరవిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించాలని ఆయన స్థానిక నాయకులకు ఆదేశించారు.

పిఠాపురం శాసన సభ్యుడిగా మాత్రమే కాకుండా, ఒక సోదరుడిగా, కుటుంబ సభ్యుడిగా ఈ కానుకలు పంపినట్టు తెలిపారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions