Tuesday 21st July 2026
12:07:03 PM
Home > తాజా > బాక్సాఫీస్ ఛాంపియన్ ‘పెద్ది’.. తొలిరోజే కలెక్షన్ల సునామీ!

బాక్సాఫీస్ ఛాంపియన్ ‘పెద్ది’.. తొలిరోజే కలెక్షన్ల సునామీ!

  • రామ్ చరణ్ మెగా రికార్డ్!

Peddi Movie First Day Collections | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు సాన తెరకెక్కించిన మోస్ట్ అవేటెడ్ రగ్గడ్ మాస్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది.

గురువారం ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం.. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుని థియేటర్లలో సందడి చేస్తోంది.

ఈ క్రమంలోనే అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘పెద్ది’ వరల్డ్‌వైడ్ ఫస్ట్ డే కలెక్షన్ల అధికారిక నివేదిక వచ్చేసింది. ‘పెద్ది’ చిత్రం ప్రీమియర్స్, మొదటి రోజు వసూళ్లను కలుపుకుని ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 135.36 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

బాక్సాఫీస్ ఛాంపియన్..
ఈ భారీ వసూళ్ల పోస్టర్‌ను షేర్ చేస్తూ.. ‘బాక్సాఫీస్ ఛాంపియన్ పెద్ది’ అని మేకర్స్ ట్వీట్ చేశారు. మొదటి రోజే ఏకంగా 30 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.

మొదటి రోజు సాధించిన ఈ అద్భుతమైన నంబర్స్‌ తో రెండో రోజు కూడా థియేటర్ల వద్ద కాసుల సునామీ సృష్టించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

చరణ్ నటనా విశ్వరూపం.. ఫ్యాన్స్ సంబరాలు..
చాలా కాలం తర్వాత రామ్ చరణ్ వన్-మ్యాన్ షోతో బాక్సాఫీస్ వద్ద పర్ఫెక్ట్ మాస్ హిట్ అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

‘పెద్ది’ పాత్రలో రామ్ చరణ్ తన నటనా విశ్వరూపం చూపించారని, యాక్షన్ మరియు ఎమోషనల్ సీన్స్‌లో చరణ్ పర్ఫార్మెన్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉందంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్, ఆడియన్స్ విపరీతంగా పోస్టులు పెడుతున్నారు.

థియేటర్ల వద్ద హంగామా..
టాలీవుడ్ లో చాలా రోజుల తర్వాత ఒక ప్యూర్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న సినిమా వచ్చిందని, చరణ్ కెరీర్‌లోనే ఇది ల్యాండ్‌మార్క్ హిట్‌గా నిలిచిపోతుందని థియేటర్ల వద్ద మెగా ఫ్యాన్స్ బాణాసంచా కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions