Friday 7th August 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ‘చంద్రబాబు రేవంత్ ఫడ్నవీస్.. దావోస్ లో టీంఇండియా’

‘చంద్రబాబు రేవంత్ ఫడ్నవీస్.. దావోస్ లో టీంఇండియా’

Chandrababu Revanth Fadnavis Meet’s At Davos | దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం ( World Economic Forum )లో ఇండియా నుండి పలువురు కేంద్రమంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు మరియు వివిధ కంపెనీల సీఈఓలు హాజరైన విషయం తెల్సిందే.

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ప్రస్తుతం అక్కడే ఉన్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ( Cm Chandrababu ), తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ( Cm Revanth Reddy ), మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ( Devendra Fadnavis ) కలిశారు.

ఈ సందర్భంగా రౌండ్ టేబుల్ డిస్కషన్ ( Round Table Discussion ) లో పాల్గొన్నారు. ఇందులో రాష్ట్రాల అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థ, ఆవిష్కరణలు, సాంకేతికత, AI, సుస్థిరత, ఉద్యోగాలు వంటి అంశాలపై మాట్లాడారు. ఇదిలా ఉండగా ముగ్గురు సీఎంలు కలిసి ఫోటోలు దిగారు.

ఈ క్రమంలో భేటీకి సంబంధించిన ఫోటోను సీఎం చంద్రబాబు సోషల్ మీడియాలో షేర్ చేశారు. టీం ఇండియా ఎట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ( Team India At WEF ) అంటూ ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు రేవంత్, ఫడ్నవీస్ తో కలిసున్న ఫోటోను పంచుకున్నారు.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions