Tuesday 29th July 2025
12:07:03 PM
Home > తాజా > యూజ్ లెస్ ఫెలో.. నిరుద్యోగులను బూతులు తిడతావా: బండి సంజయ్!

యూజ్ లెస్ ఫెలో.. నిరుద్యోగులను బూతులు తిడతావా: బండి సంజయ్!

bandi sanjay

* కేటీఆర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన బండి సంజయ్

‘‘యూజ్ లెస్ ఫెలో.. ఉద్యోగాలు ఎందుకివ్వడం లేదని నిరుద్యోగులు నిరసన తెలిపితే సముదాయించాల్సింది పోయి తిడతావా? దవడ పళ్లు రాలకొడితే సరి.. కండకావరమెక్కి మాట్లాడుతున్నవ్.

ఒక్కసారి మడతల చొక్కా.. అరిగిన రబ్బర్ చెప్పులేసుకున్న నీ గతాన్ని గుర్తు చేసుకో’’ అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) తీవ్రస్థాయిలో కేటీఆర్ పై ధ్వజమెత్తారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా చొప్పదండి నియోజకవర్గం గంగాధరకు వచ్చిన బండి సంజయ్ కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానిక బీజేపీ అభ్యర్ధి బొడిగె శోభ (Bodige Shobha)తో కలిసి సంజయ్ ప్రసంగించారు. 

యూజ్ లెస్ ఫెలో. ఉద్యోగాల కోసం అల్లాడుతుంటే నిరసన తెలిపితే సముదాయించాల్సింది పోయి తిడతావా? దవడ పళ్లు రాలకొడితే సరి.  

సీఎంగా కేసీఆర్ ముఖమే చూడలేకపోతున్నం. ఇగ కండకావరమెక్కిన కేటీఆర్ ను ఎవడు చూడాలే. ఒక్కసారి గతంలోకి వెళ్లు ముడతల చొక్కా, అరిగిన రబ్బర్ చెప్పుల సంగతి గుర్తు లేదా?

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలో ఏ పార్టీ అధికారంలో వచ్చినా మధ్యంతర ఎన్నికల తథ్యం. బీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ తన కొడుకును సీఎం చేస్తాడు.

అప్పుడు కవిత, హరీష్ రావు, సంతోష్ రావు ఊరుకుంటారా? వాళ్లంతా తలో 10 మంది ఎమ్మెల్యేలను తీసుకుని వెళ్లిపోతే ప్రభుత్వం ఉంటదా?

కాంగ్రెస్ లో అందరూ సీఎంలే. ఒకరిని సీఎం చేస్తే మిగిలిన వాళ్లంతా ఎమ్మెల్యేలను వెంట బెట్టుకుని పార్టీని వీడతారు.

ఈ రెండు పార్టీల్లో ఏది అధికారంలోకి వచ్చినా ప్రభుత్వం అర్ధంతరంగా కూలిపోవడం ఖాయం. మళ్లీ ఎన్నికలు ఖాయం.

కేసీఆర్ పాలనలో సీఎంసహా మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఫాంహౌజ్ లు కట్టుకున్నరు… కేసీఆర్ కూడా 100 రూముల ప్రగతి భవన్ కట్టుకున్నడు. మరి నిలువనీడలేని  పేదలకు మాత్రం గూడు ఎందుకు కల్పించలేదు? వాళ్లు చేసిన పాపమేంది?

పంట నష్టపోయిన రైతులకు పరిహారం సంగతేమైంది? వడగండ్ల వానతో పంట నష్టపోతే ఇదే నియోజకవర్గానికి కేసీఆర్ వచ్చి ఇచ్చిన హామీ ఏమైంది?

కరీంనగర్, చొప్పదండిలో రెండో స్థానం కోసమే బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.

మీకోసం కొట్లాడి జైలుకు పోయినోళ్లను గెలిపిస్తారా?… భూకబ్జాలు, రౌడీషీట్లు, చీటర్లు, గ్రానైట్, అక్రమ సంపాదన కేసులున్న వాళ్లను గెలిపిస్తారా?

కాంగ్రెస్ 6 గ్యారంటీలను మడిచి పెట్టుకోండి. కానీ గెలిచాక అమ్ముడుపోబోమనే గ్యారంటీ ఇవ్వగలరా?పాతబస్తీలో కరెంట్ బిల్లులు వసూలు చేయలేని దద్దమ్మ కేసీఆర్.

12 శాతం ఓట్ల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎంఐఎంకు కొమ్ముకాస్తున్నయ్. మరి 80 శాతమున్న హిందువులంతా సంఘటితం కావాల్సిన అవసరం ఉంది.” అని పిలుపునిచ్చారు బండి సంజయ్.

You may also like
kcr ktr
కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్న కేటీఆర్..!
ktr pressmeet
లోకేశ్ ను కలవలేదు.. కలిస్తే తప్పేంటి: కేటీఆర్
bandi sanjay comments
పేదలకు ఒక న్యాయం.. అక్బరుద్దీన్ కుఒక న్యాయమా: బండి సంజయ్!
bandi sanjay comments
సీఎంవో అడ్డాగా ఫోన్ ట్యాపింగ్.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions