Monday 17th March 2025
12:07:03 PM
Home > తాజా > రేవంత్ జీవితం మొదలైంది అక్కడే.. ఒవైసీ సంచలన వ్యాఖ్యలు!

రేవంత్ జీవితం మొదలైంది అక్కడే.. ఒవైసీ సంచలన వ్యాఖ్యలు!

asaduddin owaisi

Asaduddin Comments On Revanth | హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ (KCR) హాట్రిక్ విజయం సాదించడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.

గతంలో తాము ఎప్పుడు కాంగ్రెస్ (Congress)తో కలవలేదని, కేవలం వైఎస్ రాజశేఖరరెడ్డి (YS Rajasekhar Reddy)తో మాత్రమే ఉన్నామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అలాగే కాంగ్రెస్ అభ్యర్ధి అజారుద్దీన్ (Azharuddin)పై మాట్లాడుతూ ఆయనొక మంచి క్రికెటర్ అని, కానీ విఫల రాజకీయనాయకుడు అని తెలిపారు ఒవైసి.

జూబ్లీహిల్స్ (Jublee Hills) లో బీఆరెస్ అభ్యర్థిని ఓడించి తీరుతామని స్పష్టం చేశారు. అలాగే ఆరెస్సెస్ విస్తరించకూడదనే ఉద్దేశంతోనే నిజామాబాద్ వంటి స్థానాల్లో పోటీ చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) జీవితం ఆరెస్సెస్ (RSS)తోనే మొదలైందని, కాంగ్రెస్ గాంధీ భవన్ రిమోట్ మోహన్ భగవత్ (Mohan Bhagavath) చేతిలో ఉందని ఆరోపించారు అసదుద్దీన్ ఓవైసీ.

You may also like
south concern on delimitation
త్వరగా పిల్లల్ని కనండి.. సీఎం రిక్వెస్ట్.. అసలు డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాల ఆందోళన ఎందుకు?
cm revanth reddy
విద్యార్థి జీవన్మరణ పోరాటం.. స్పందించిన సీఎం రేవంత్!
పార్టీ మారిన ఎమ్మెల్యేలకు షాక్.. నోటీసులు ఇచ్చిన అసెంబ్లీ కార్యదర్శి!
kcr
అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. కేసీఆర్ కు లీగల్ నోటీసులు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions