Konda Surekha | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచార వేగాన్ని పెంచాయి ప్రధాన పార్టీలు. తీరొక్క రకాల ప్రచారాలు చేస్తూ ఓట్లు అభ్యర్ధిస్తున్నారు నేతలు.
ఈ నేపథ్యంలో ఆసక్తికరమైన దృశ్యాలు చోటుచేసుకుంటున్నాయి.
చిన్నపిల్లలకు, వృద్ధులకు స్నానం చేపించి తమ పార్టీకి ఓటు వేయాలని కోరుతున్నారు ప్రధాన పార్టీ కార్యకర్తలు.
కాగా వరంగల్ (Warangal) తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్ధి కొండా సురేఖ (Konda Surekha) మాత్రం వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించారు.
తన నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్న ఆమె దారిలోనే ఉన్న బీఆరెస్ పార్టీ (BRS Party) కార్యాలయానికి వెళ్లి మరీ కాంగ్రెస్ పార్టీ (Congress Party)కి ఓటు వేయాలని కోరారు.
కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ బీఆరెస్ కార్యాలయానికి రావడంతో ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు బీఆరెస్ నేతలు. కానీ కొండా సురేఖ మాత్రం నవ్వుతూ తనకు ఓటువేయలని కోరారు.
అనంతరం బీఆరెస్ కార్యాలయం నుండి చిరునవ్వుతో బయటకు వచ్చారు. కాగా కొండా సురేఖ బీఆరెస్ కార్యాలయానికి వెళ్లి ప్రచారం నిర్వహించిన వీడియో తెగ వైరల్ అయ్యింది.